Good Friday song
పల్లవి:-
ఆహా మహాత్మ హా శరణ్యా
హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను
నా దోషమేగదా
(ఆహా మహాత్మ)
చరణం:-+01
వీరలను క్షమించు తండ్రి
నేర రేమియున్
కోరి తిటులు నిన్ను
జంపు క్రూరజనులకై
(ఆహా మహాత్మ)
చరణం:-+02
నీవు నాతో బరదైసున
నేడె యుందువు
పావనుండ యిట్లు బలికి
పాపిగాచితి
(ఆహా మహాత్మ)
చరణం:-+03
అమ్మా! నీ సుతుడటంచు
మరియమ్మతో బలికి
క్రమ్మర నీ జనని యనుచు
గర్త నుడివితి
(ఆహా మహాత్మ)
చరణం:-+04
నా దేవ దేవ యేమి విడ
నాడితి వనుచు
శ్రీదేవ సుత పలికితివి శ్రమ
చెప్పశక్యమా
(ఆహా మహాత్మ)
చరణం:-+05
దప్పికొనుచున్నా నటంచు
జెప్పితివి గద
యిప్పగిదిని బాధ నొంద
నేమి నీకు హా
(ఆహా మహాత్మ)
చరణం:-+06
శ్రమ ప్రమాదములను గొప్ప
శబ్ద మెత్తి హా
సమాప్తమైన దంచు దెలిపి
సమసితివి గదా
(ఆహా మహాత్మ)
చరణం:-+07
అప్పగింతు దండ్రి నీకు
నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి
కూలిపోతివా
(ఆహా మహాత్మ)

0 Comments